ప్రేమికుల రోజు... పింక్, ఆరెంజ్, బ్లూ, బ్లాక్, ఎల్లో, గ్రీన్, రెడ్, వైట్ అంటే ఏమిటి?

బుధవారం, 13 ఫిబ్రవరి 2013 (19:53 IST)
FILE
వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి రంగురంగుల రోజాలు వచ్చేస్తున్నాయి. బెంగళూరు నుంచి ప్రేమికుల రోజు సెలబ్రేషన్‌లో ఓ భాగమైన రోజాలు మన రాష్ట్రానికి చేరాయి.

ఈ రోజాలు ప్రేమికులను పెద్దఎత్తున ఆకట్టుకుంటున్నాయి. చాక్లెట్ డే, టెడ్డీ, ప్రామిస్ డే అంటూ గత వారమంతటా హ్యాపీగా వాలైంటెన్స్ డే సెలబ్రేషన్‌లో మునిగిపోయిన యూత్.. రేపు అదే ప్రేమికుల రోజున తమ ప్రేయసి/ ప్రియులను వివిధ కానుకలను అందజేసి తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందుకోసం ప్రేమికులు తమ గిఫ్ట్ ప్యాక్‌లో సాధారణ రెడ్ రోస్‌లా కాకుండా వివిధ రంగుల రోజా పువ్వుల్ని ఎంచుకుంటున్నారు. ప్రేమికుల రోజు కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన తాజ్‌మహల్ అనే రెడ్ రోస్ బొకే (పుష్పగుచ్ఛం)లు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లో కనువిందు చేస్తున్నాయి. ఇదేవిధంగా డచ్ రోస్, జెర్బురా, బ్లూ స్టైల్, ఆర్కట్, కరిష్మా, ఫైవ్ స్టార్ అనే వివిధ రకాల రోజా పుష్పగుచ్ఛాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ప్రేమికుల రోజు డ్రెస్ కోడ్ మీకు తెలుసా?
ఫిబ్రవరి 14-వాలెంటైన్స్ డే- డ్రెస్ కోడ్
పింక్- గోయింగ్ టు ప్రపోజ్
ఆరెంజ్ -ఆల్రెడీ ఇన్ లవ్
బ్లూ - అప్లికేషన్స్ వెల్‌కమ్డ్
బ్లాక్ - నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్
ఎల్లో - ఫెయిలూర్
గ్రీన్ - లవ్ అసెప్‌టెడ్
రెడ్ - ఆల్ రెడీ బుక్డ్
వైట్- డబుల్ సైడ్.

వెబ్దునియా పై చదవండి