ప్రేయసికి మధురాతి మధురమైన ముద్దు... ఎందుకు...?

WD
ప్రేమను ప్రపోజ్ చేయడమనే క్షణం ఎంతో మధురమైనది. ఆ క్షణం కోసం ఎంతమంది ఎంతకాలం ఎదురుచూస్తుంటారో లెక్కలేదు. అంతేకాదు, ఆ ప్రపోజ్ చేసే పద్ధతిని ఒకటికి వందసార్లు రిహార్సల్స్ వేసుకుని వెళ్లేవారున్నారు. ఇంత ప్రయత్నం చేసినా చివరికి ఆ క్షణంలో గొంతు పెగలదు. మాట తడబడుతుంది. గొంతు వణుకుతుంది. ఒళ్లు మొత్తం చెమటలు పడతాయి.

ఇదంతా మనసులోని ఇష్టానికి శరీరం చూపే స్పందన. ఆ ఉద్వేగం తట్టుకోలేక శరీరం పడే ఇబ్బందిని ఇతరులెవరూ గమనించడం ఎవరికీ ఇష్టం ఉండదు. తన ప్రపోజల్‌ని అవతలివారు అంగీకరించగానే వెంటనే కలిగే శారీరక స్పందన కౌగిలింతగా లేదా ముద్దుగా లేక మరేదైనా చర్యగా మారవచ్చు.

అది కూడా ఏకాంతంగా వుంటే అంత మధురంగా ఉంటుంది. మగవాడు ప్రపోజ్ చేయాలని కోరుకునే అమ్మాయిలు కూడా ఆ ప్రపోజల్‌ను వెంటనే అంగీకరించడం అరుదనేది అబ్బాయిల అనుభవం. మేము దిగివస్తే అమ్మాయిలు బెట్టు చేస్తుంటారని చాలామంది అబ్బాయిల సమాధానంగా ఉంటుంది. అయితే ప్రపోజ్ చేసే విషయంలో ఫలానావారే చొరవ తీసుకోవాలనే నిబంధన ఏమీ లేదు.

ఎవరిలో ప్రేమ స్పందనలు అధికంగా ఉంటాయో, ఎవరైతే ఎక్కువగా మనసు పారేసుకున్నారో వారు ముందుగా పెదవి విప్పి తమ ప్రేమ వ్యవహారం మరికొంచెం ముందుకు నడిపిద్దామని అనుకోవడం తప్పులేదు. ప్రేమను పదికాలాలపాటు పచ్చగా ఉంచుకునే ప్రయత్నంలో దాపరికాలు కూడదు మరి.

వెబ్దునియా పై చదవండి