ఇంటి ఆవరణలో నీటివాటం ఎలా ఉండాలి?

ఇంటి ఆవరణలో నీరు ఈశాన్యం-తూర్పు-ఉత్తర దిశల నుంచి బయటకు పోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అందుచేత ఈశాన్యం- తూర్పు-ఉత్తర దిశల నుంచి పైపులను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరమని వారు అంటున్నారు. పై దిక్కుల గుండా ఇంటి ఆవరణలోని నీటిని బయటికి పంపడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు చెబుతోంది.

అదేవిధంగా.. ఇంటి ఆవరణలోని నీరు ఆగ్నేయం నుంచి దక్షిణ, నైరుతి, పశ్చిమ వాయువ్య దిశలలో ప్రవహిస్తూ, ఉత్తర-ఈశాన్య- తూర్పు దిశల నుంచి వెలుపలకు పోవడం శుభప్రదం. ఇతరుల ఇళ్లలో వాడిన నీరు ఇంటి ఆవరణలోకి ప్రవేశించకూడదు.

ఇకపోతే.. ఇంటి ఆవరణలో ఈశాన్య దిశగాని, తూర్పు, ఉత్తర దిశలలోగాని బావి తవ్వడం మంచిది. అన్నింటికంటే ఈశాన్య దిశలో బావి ఉండటం శ్రేయస్కరం అదేవిధంగా ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, వాయువ్య దిశల్లో బావి ఉండకూడదు.

వెబ్దునియా పై చదవండి