పడక గది భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. ఆ గదిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటే దంపతుల ఆరోగ్యం, ప్రేమానుబంధాలకు ఎలాంటి లోటుండదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం దంపతుల ప్రధాన పడక గది నైరుతిలో వుండాలి. సౌత్ వెస్ట్ అని పిలిచే నైరుతి మూలాన పడక గది ఉంటే ఆ దంపతులు అన్యోన్యంగా జీవిస్తారు.
అయితే వాయువ్య మూలన ఉండే గది పడక గదిని దంపతులు ఉపయోగించకూడదని వాస్తు తెలిపింది. ఈ చిత్రాలకు ఎరుపు రంగు ఫ్రేమ్ ఉంటే మరింత సానుకూల ఫలితాలు వస్తాయి. పడకగదిలో తలవైపు గోడకు కిటికీ ఉండరాదు. ఇలా ఉంటే ప్రతికూల ప్రభావాలు తప్పవు. పడకగదిలో వంగపండు రంగు, గులాబి, లేత ఎరుపు రంగులు దంపతులకు సానుకూల ఫలితాలనిస్తాయి.
ముదురు ఆకుపచ్చ, నలుపు, నీలం రంగులు దంపతుల మధ్య వ్యతిరేక భావనలకు కారణమవుతాయి. అలాగే నిద్రించేటప్పుడు దక్షిణం వైపు తలను పెట్టుకోవడం, కాళ్లు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెప్తోంది.
పడక గదిలో తెరచిన అలమరలు వుండకూడదు. తేమ ఎక్కువగా వుండకుండా చూసుకోవాలి. పెద్ద శబ్దాలు వినిపించేలా వుండటం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తోంది. పడక గది దక్షిణపు గోడవైపు తలపెట్టి పడుకునే వారు ఆ గోడకు పావురాల జంట చిత్రం, హృదయాకారపు చిత్రాలు, నవ్వుతూ ఉన్న దంపతుల చిత్రాలను అమర్చుకోవాలి.