అలంకరణ చేసుకునే ముందుగా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో స్పష్టంగా ఉండాలి. అప్పుడే ఆ బట్టలకు తగినట్లుగా మేకప్ వేసుకోవచ్చు. కొన్ని సమయాల్లో మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది.. అలాంటప్పుడు ప్రైమర్ తప్పనిసరిగా వాడాలి. అప్పుడే ఎంత ఆలస్యం అయినా కూడా మీ ముఖం తాజాగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంటి కింద నల్లటి వలయాలు వారు కన్సీలర్ వాడితే మంచిది.
అలానే మెుటిమల ముఖానికి కూడా ఈ కన్సీలర్ వేసుకోవాలి. అయితే అది మీ ముఖానికి కరెక్ట్‌గా ఉండాలి. ఆ తరువాత కనురెప్పలకై కూడా కొద్దిగా ఫౌండేషన్ రాసుకుని కాస్త కాజల్ రాసుకుంటే చాలు. తరువాత పెదాలకు లేతరంగులో లిప్‌స్టిక్ వేసుకుని, మీ మేకప్‌కు తగిన విధంగా జడ వేసుకోవాలి. చివరగా దుస్తులకు తగినట్టు నగలు వేసుకుంటే సరిపోతుంది.