వైవాహిక బంధం బలంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..?

మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (11:56 IST)
సాధారణంగా ప్రతీ ఒక్కరూ వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వాస్తు నియమాలు మనిషి జీవితం సాఫీగా సాగేందుకు ఉపకరిస్తాయి. ప్రతి వాస్తు నిబంధన వెనుక శాస్త్రీయ కారణం తప్పక ఉంటుంది. ఒకవేళ ఇంటిని మనం నిర్మించుకుంటే.. అది వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చును. కానీ అప్పటికే నిర్మాణం పూర్తయిన ఇంట్లోకి వెళ్తే.. వాస్తుకు అనుగుణంగా దాన్ని పూర్తిగా మార్చలేం. అందువలన ఈ కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే.. మంచిదని పండితులు చెప్తున్నారు.
 
ఇంట్లో బోరింగ్ లేదా బావి తప్పుడు దిశలో ఉంటే.. బోరింగ్‌కు నైరుతి దిశలో పంచముఖి హనుమాన్ చిత్రపటాన్ని ఉంచితే సరిపోతుంది. అలానే ధ్యానం చేసుకునేందుకు ఈశాన్యం సరైన దిశ. ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈశాన్యంలో ధ్యానం చేయడం ఉపకరిస్తుంది. ముఖ్యంగా ప్రవేశ ద్వారానికి ఎదురుగా గోడ ఉన్నట్టయితే ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. దీన్ని అధిగమించడానికి వినాయకుని చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచుకుంటే మంచిది. 
 
వైవాహిక బంధం బలంగా ఉండడానికి బెడ్ మీద ఒకే మ్యాట్రిస్‌ను ఉంచుకోవాలి. భర్తకు భార్య ఎడమ వైపు నిద్రించాలి. అలానే బెండ్రూమ్‌ను పూర్తి చీకటిగా ఉంచకూడదు. వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అవసరం లేని వస్తువులను తీసేయాలి. ముఖ్యంగా బెడ్ కింద ఉంచొద్దు. ఇంటి నిర్మాణంలో తలుపులు, కిటికీలు సరి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. 
 
ఇంట్లోని వాస్తు దోషాలను అధిగమించడానికి వ్యూహాత్మక స్థానాల్లో పిరమిడ్లను ఉంచడం ఉపకరిస్తుంది. అలానే ఇంటి మధ్యలో లేదా ప్రత్యేకంగా ఓ గదిలో లేదంటే శక్తిపరంగా ముఖ్యమైన స్థానంలో పిరమిడ్లను ఏర్పాటు చేయాలి. తూర్పు దిశలో ఆకుపచ్చని మొక్కల్ని పెంచడం వలన వివాహ సంబంధాలు మెరుగవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు