సాధారణ పౌరుడిలా క్యూలో నిలబడి ఓటేసిన కేరళ ముఖ్యమంత్రి

మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (11:24 IST)
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సాధారణ పౌరుడిలా మారిపోయాడు. ఆయన సాధారణ పౌరులు నిలబడినట్టుగానే క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
సాధారణంగా వామపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు నిరాడంబరతకు మారుపేరు. పేరుకు అధికారంలో ఉన్నప్పటికీ.. ఆ దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించరు. పార్టీ నిబంధనలను ఏమాత్రం ఉల్లఘించరు. దీంతో పాటు.. వ్యక్తిగత క్రమశిక్షణలో ముందువరుసలో ఉంటారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా తామూ ప్రజల్లో భాగమన్న అభిప్రాయం వారిలో బలంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌. 
 
మూడో విడత పోలింగ్‌లో భాగంగా తన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన సోమవారం ఓటు వేశారు. ఓటు హక్కు ఉన్న కన్నూరు జిల్లాలోని పినరయిలోని ఆర్సీ అమల బేసిక్‌ యూపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌కు విచ్చేశారు. భారీ క్యూ ఉన్నప్పటికీ సాధారణ పౌరుని మాదిరిగా క్యూలో నిల్చున్నారు. 
 
తనవంతు వచ్చినప్పుడు బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి నిరాడంబరత్వాన్ని పలువురు అభినందించారు. మూడో విడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా సోమవారం వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 116 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు