తలుపు గడపపై కూర్చోకూడదు అనే నియమం మూఢనమ్మకం కాదు. సైన్స్ పరంగా ఇది ధృవీకరించడబడినది. డ్రోసింగ్ రాడ్ అనే శాస్త్రవేత్త కనుగొన్న తరువాత ఈ మాట అక్షరసత్యమని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇంటికి ప్రధాన ద్వారం పైన కూర్చోవడం మంచిది కాదు. అలా కూర్చుంటే అరిష్టం.. దరిద్రం కూడా. కిటికీలు, ద్వారాల ద్వారానే గాలి, వెలుతురు మన ఇంట్లోకి వచ్చి వెళుతూ ఉంటాయి. అలాంటప్పుడు మన ఇంట్లోకి వచ్చే గాలి, వెలుతురును ఇంటి లోపల గల నెగిటివ్ ఎనర్జీ బయటకు తీసుకెళ్ళే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు.
చాలామంది గడప దగ్గర చిన్నచిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. గడపకు మధ్యలో కూర్చోవడం అస్సలు మంచిది కాదు. గడపకు కింద ఉన్న మెట్లపై కూర్చోవడం కూడా శ్రేయస్కరమే కాదు. అలా కూర్చుంటే ఇంటిలోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు, పూజలు నిర్వహించి నవరత్నాలు, పంచలోహ వస్తువులను ప్రధాన ద్వారం గడప కింద ఉంచడం ఆనవాయితీ. అందుకే ప్రధాన ద్వారం అంటే గడపను దైవాంసంగా లక్ష్మీదేవిగా పూజిస్తాం. అలా కూర్చుంటే లక్ష్మీదేవిని అవమానించనట్లే అవుతుంది. అందుకే పూర్వీకులు గడపపైన నిలబడడం, ఎక్కి నిల్చోవడం లాంటివి చేయకూడదని చెబుతుంటారు.