వివాహం కాని అమ్మాయిలు తులసిని ఆ దిక్కులో పెట్టి పూజిస్తే...

సోమవారం, 10 జనవరి 2022 (23:43 IST)
తులసిలో విష్ణుమూర్తి నివాసం వుంటాడని విశ్వాసం. అందుకే ప్రతిరోజూ తులసి మాతకు ప్రార్థన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెపుతారు. అటువంటి తులసిని ఇంటికి ఎటువైపు పెట్టుకోవాలనే సందిద్గం చాలామందిలో వుంటుంది.

 
తూర్పు ద్వారం ఇల్లు వున్నవారు అయితే ఆగ్నేయ దిశలో కుండీలో తులసిని పెట్టుకోవచ్చు. ఐతే కొందరు తులసిని నేలలో నాటేస్తుంటారు. అలా చేయకూడదు. తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి. అపార్టుమెంట్లలో వుండేవారు తులసి కోటను నిర్మించలేరు కనుక కుండీలో పెట్టుకోవచ్చు.

 
అలాగే పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలని వాస్తు పండితులు చెపుతున్నారు. ఉత్తర ద్వారం ఇంటికి వాయవ్యంలోను తులసిని పెట్టుకోవచ్చు. ఐతే ఈశాన్యంలో గానీ తూర్పున గానీ, ఉత్తరానగానీ తులసికోట కట్టకూడదని వాస్తు నిపుణులు చెపుతున్నారు. అలాగే తూర్పు ద్వారం వున్న ఇంటికి ఆగ్నేయంలో తులసికి పెళ్లికాని అమ్మాయిలు ప్రతిరోజూ నీరుపోసి పూజ చేస్తుంటే త్వరలో వివాహమవుతుందని నమ్మకం.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు