సాధారణంగా ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెంచడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. అంతేగాకుండా మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలుండవ్. రుణబాధలు తీరిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాంటి మనీ ప్లాంట్‌ను ఎలా పెంచాలంటే.. ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెంచే దిశను ఎంచుకోవడం అధిక శ్రద్ధ తీసుకోవాలి.
ఇంకా మనీ ప్లాంట్‌ను మట్టిలో వుంచే పెంచాలి. ఇంకా నీటి డబ్బాల్లో వుంచి పెంచవచ్చు. ఇంటిలోపల కానీ, బయట కానీ మనీ ప్లాంట్‌ను పెంచడం చేయొచ్చు. దీనివల్ల ఇంట్లో సంపదకు లోటుండదు. మనీ ప్లాంట్‌లో ఆకులు వాడితే వెంటనే వాటిని తొలగించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.