అలాగే ప్రతి మంగళ, గురు, శుక్రవారాల్లో, అష్టమీ, నవమి, దశమి, త్రయోదశి, పౌర్ణమి, శుద్ధ పాడ్యమీ తిథుల్లో శ్రీ మహాలక్ష్మిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ధనాదాయం పొందాలంటే.. ఈతిబాధలు తొలగిపోవాలంటే.. మంగళవారం పూట శ్రీ లక్ష్మిని అర్చించి.. శ్రీసూక్తిని 3 సార్లు పఠించాలి.
''చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్'' అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితువు చెప్తున్నారు.