వాయవ్యదిశలో ఎలక్ట్రిక్ మీటర్ వుండకూడదట!

శనివారం, 7 మార్చి 2015 (19:56 IST)
వాయవ్యదిశలో ఎలక్ట్రిక్ మీటర్ వుండకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. వాయవ్య దిశయందు పైకెళ్ళుటకు మెట్లున్నట్లైతే శుభము. వాయవ్యమున వాహనములను నిలిపినచో శుభములు కలుగును. 
 
వాయవ్య ద్వారమునకు ఎదురుగా రోడ్ ఉన్నచో అనారోగ్యములు కలుగును. వాయవ్యమున డైనింగ్ హాల్ శుభఫలితములు ఇచ్చును. వాయవ్యమున వుండే రోడ్ కంటే గృహము ఎత్తుగా వుండకూడదు. గృహము నందు వాయవ్య భాగమునున్న గదులు అద్దెకు ఇచ్చుటచే శుభ ఫలితములు కలుగును.
 
వాయవ్య ద్వారము - పడమర దిశను చూస్తే అశుభము. వాయవ్య ద్వారము ఉత్తరాభిముఖముగా ఉన్నట్లైతే ధనలాభము. వాయవ్య దిశలో ఖాళీ స్థలము వదలకూడదు. వాయవ్య మూలన నీళ్ళు కుండీ ఉంటే శుభ ఫలితములు కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి