నిర్మాల్య దోషం అంటే ఏంటో తెలుసా?

మంగళవారం, 20 జనవరి 2015 (15:36 IST)
నిర్మాల్య దోషం అంటే ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదవండి. తోటలోవే అయినా.. కొన్నవే అయినా తాజా పూలను మాత్రమే భగవంతుడికి సమర్పించాలని పండితులు అంటున్నారు.

ఇక ఎంతటి మేలుజాతి పూలైనా, కొద్దిగానే వాడిపోయినా మరునాడు ఉదయాన్నే ఆ నిర్మాల్యాలను తీసివేయాలి. లేదంటే నిర్మాల్య దోషం కలుగుతుందని అంటారు. ఇలా నిర్మాల్య దోషం లేని పూలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఒక్క గన్నేరు మాత్రమేనని చెప్పుకోవాలి. 
 
గన్నేరు జాతికి చెందిన పూలు అందంగా ... ఆకర్షణీయంగానే కాదు, ఎంతో పవిత్రతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాయి. గన్నేరు పూలను ఒకసారి పూజకి ఉపయోగించిన తరువాత, మరునాడు ఉదయమే తీసివేయక పోవడం వలన దోషం వుండదు. ఒకసారి వాటిపై నీటిని చిలకరించి, తిరిగి వాటిని భగవంతుడి సేవకు ఉపయోగించవచ్చునని పండితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి