దక్షిణమున వరండాలు నిర్మిస్తే అశుభాలు తప్పవట!

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:36 IST)
దక్షిణదిశలో దక్షిణ అభిముఖముగా వంటచేయరాదు. గృహమునకు కిటికీలు, వెంటేలేటర్లు దక్షిణదిశలో వుండకూడదు. దక్షిణపుగదిలో ఉన్న దేవుని ఫోటోలు ఉత్తరాభిముఖముగా నుండి పూజలు చేయకూడదు. 
 
దక్షిణపు గోడను ఆనుకుని బరువైన సామాన్లు ఉండుట మంచిది. పరిశ్రమలలో భారీ యంత్రములను దక్షిణమున ఏర్పాటు చేయుట వలన లాభములు, అభివృద్ధి బాగుంటాయి. దక్షిణ దిశలో సింహద్వారము దక్షిణాభిముఖముగా ఉన్నప్పుడు- ఉత్తరదిశలో కూడా దానికి ఎదురుగా ఒక ద్వారం తప్పకుండా ఉండాలి. 
 
దక్షిణ సింహద్వారము నైరుతివైపు తిరిగి వుండకూడదు. దక్షిణమున మేడమెట్లు నిర్మాణము చేయవచ్చు.- కానీ అది నైరుతి వైపు పెరుగుతూ వెళ్ళితే మంచి ఫలితాలుంటాయి. దక్షిణమున వరండాలు నిర్మిస్తే అశుభాలు తప్పవు.

వెబ్దునియా పై చదవండి