వాస్తు మార్పులు.. పూర్తయ్యాకే సచివాలయంలోకి జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ?

ఆదివారం, 2 జూన్ 2019 (18:11 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముహూర్తాలను ఈ మధ్యకాలంలో బలంగా విశ్వసిస్తున్నారు. తాజాగా సచివాలయంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. కేబినెట్ ప్రమాణస్వీకారం కూడా ముహూర్తం ప్రకారమే చేయనున్నారు. 
 
సచివాలయంలో మార్పుల కోసం వాస్తు నిపుణుల సూచనలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎం ఛాంబర్‌లోకి వెళ్లే ఒక ద్వారం మూసి వేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చీఫ్ సెక్రటరీ ఛాంబర్‌‌ను కూడా మార్చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే సీఎస్ ఛాంబర్‌ను ఆగ్నేయం నుంచి మరో చోటకు మారుస్తున్నారు. పాత ఛాంబర్ పక్కనే మరో కొత్త ఛాంబర్ నిర్మాణానికి అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తు ప్రకారం మార్పులు పూర్తి చేశాక సచివాలయ ప్రవేశం చేస్తారు. 
 
అలాగే తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జూన్ 7న ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో మంత్రివర్గ కూర్పుపై జగన్ నేతలతో చర్చిస్తారని సమాచారం. అనంతరం మరుసటి రోజు జగన్ తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేస్తారని విశ్వసనీయ సమాచారం. జగన్ నేతృత్వంలో వైసీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి 151 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పార్లమెంటు సభ్యులు హాజరుకానున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు