ఉత్తర, వాయువ్య దిశలో బావి తవ్వితే..?

శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:37 IST)
ఇంటి నిర్మాణంలో బావి తవ్వకం ప్రాధాన్యత వహిస్తోంది. ఇందులో భాగంగా బావి తవ్వకం సరైన దిశలో చేపడితే ఆ ఇంటి వాసులకు సకల సంపదలు చేకూరుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని దిశల్లో బావి తవ్వకం సరైంది కాదని వాస్తు వెల్లడిస్తోంది. 
 
1. తూర్పు, ఆగ్నేయ భాగంలో బావి తవ్వకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈ దిశలలో బావి తవ్వినట్లైతే అనారోగ్యాలు అగ్ని ప్రమాదాలు, ఆర్థిక కష్టనష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇంటి యజమానికి తీవ్ర అనారోగ్యబాధలు కలుగుతాయి. 
 
2. ఉత్తర, వాయువ్య దిశలో బావి తవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ స్థలంలో బావి తవ్వినట్లైతే శత్రుహాని, అనారోగ్యాలు ముఖ్యంగా స్త్రీలకు సుఖశాంతులు కరువవుతాయి. మానసిక సంక్షోభం వంటి చెడు ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
3. పడమర భాగంలోను, పడమర-వాయవ్య, నైరుతి-పడమర దిశలలో బావితవ్వకూడదని వాస్తు తెలుపుతోంది. అలా బావి తవ్వకం చేపట్టినట్లైతే... ఆ గృహంలో నివసించువారికి అనారోగ్యాలు, ఆర్థిక కష్టనష్టాలు కలిగి చెడుస్నేహాలు, గౌరవ భంగం కలుగుతుందని వాస్తునిపుణులు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు