ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు ఇట్టే తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మహిళలు ముఖ్యంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చీపురుతో ఊడ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు చిమ్మడం ద్వారా ఆర్థిక పురోగతి వుండదు. అది సంపదపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది.
ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల మన మనస్సు, శరీరం, ఆరోగ్యంతో పాటు మన పురోగతి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రిపూట పొరపాటున కూడా చీపురుతో ఇల్లు చిమ్మకూడదు. అలా చేస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.