ఇంటి నుంచి వచ్చే నీరు ఎటు పోతే ఎలాంటి ఫలితం?

మంగళవారం, 28 జనవరి 2020 (17:22 IST)
ఇరుగు వారి ఇంటి నీరు తన ఇంటి వైపుకి ప్రవహించినట్లయితే పోట్లాటలు వస్తాయి. అలాగే తన ఇంటి నీరు తూరుపు దిక్కుకు ప్రవహిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. ఆగ్నేయానికి ప్రవహిస్తే ఇంట్లో డబ్బు నిలువకుండా పోతుంది. 
 
దక్షిణము వైపునకు ప్రవహించినట్లయితే మరణ భయం కలుగుతుంది. నైరుతి దిశలోకి వెళితే అధికారుల వల్ల భయం కలుగుతుంది. పడమటి వైపుకి వెళితే భార్యకు సమస్యలు ఎదురవుతాయి. వాయవ్య దిశకు నీరు వెళ్తుంటే ఇంటి పశువులకు చేటు కలుగుతుంది.
 
ఉత్తర దిశకు ప్రవహిస్తే ధనలాభం కలుగుతుంది. ఈశాన్యము వైపుకి వెళితే శుభం కలుగుతుంది. ఇంటిలో వాడే నీరు ఇంటిలోనే ఇంకినట్లయితే అమంగళము అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు