అరటి పువ్వుతో కొబ్బరి పచ్చడి తయారు చేయడం ఎలా?

File
FILE
కావలసిన పదార్థాలు :
అరటి పువ్వు : ఒకటి
కొబ్పరి తురుము : కప్పు
పచ్చమిర్చి : ఆరు
పోపు : తగినంత
ఎండు మిర్చి : 15
శనగపప్పు : 2 టీ స్పూన్లు
మినపప్పు : 2 టీ స్పూన్లు
ఆవాలు : టీ స్పూను
జీలకర్ర : టీ స్పూను
మెంతులు : అర టీ స్పూను
ఇంగువ : చిటికెడు
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
చింతపండు : కొద్దిగా
నూనె : 5 టీ స్పూన్లు
బెల్లం : రెండు టీ స్పూన్లు

తయారు చేయు విధానం : ముందుగా అరటి పువ్వును శుభ్రం చేసుకోవాలి. మిక్సిలో వేసి వక్కలుముక్కలుగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మంచినీళ్లతో శుభ్రంగా కడిగి నీరు పిండేయాలి. స్టౌ మీద బాణిలి ఉంచి నూనె వేసి కాగాక శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాణిలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కచ్చాపచ్చగా చేసి ఉంచుకున్న అరటి పువ్వును వేసి మగ్గనివ్వాలి. మిక్సిలో ముందుగా చల్లార్చిన పోపు వేసి మొత్తగా గ్రైండ్ చేయాలి. వేయించి పెట్టుకున్న అరటిపువ్వు ముద్ద, ఉప్పు, పసుపు, ఇంగువ, చింతపండు, బెల్లం వేసి మెత్తగా మిక్సీలో పట్టాలి.

వెబ్దునియా పై చదవండి