దోసకాయ పచ్చడి తయారు చేయడం ఎలా?

FILE
దోసకాయ వారానికి రెండు సార్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, కంటికి మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. చర్మ, కేశ సంరక్షణకు దోసకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాన్సర్‌కు చెక్ పెట్టడమే కాదు.. ఒబిసిటీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్ కంట్రోల్, బీపీ నియంత్రణలో దోసకాయ బాగా పనిచేస్తుంది. అలాంటి దోసకాయతో పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా..

కావాల్సిన పదార్థాలు :
నూనె : రెండు టీ స్పూన్లు
పచ్చి మిరపకాయలు : పది
నువ్వులు : ఒక టేబుల్ స్పూన్
శనగపప్పు : ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు : పది వెల్లుల్లి రేబ్బలు
చింతపండు గుజ్జు : 50 గ్రాములు
దోసకాయ : ఒక కిలో
ఉప్పు : తగినంత
ఆవాలు : ఒక టీ స్పూన్
ఎండు మిరపకాయలు : పది
మినపప్పు : కొంచెం
ఇంగువ : ఒక టీస్పూన్

తయారు చేసే పద్ధతి : ఒక టీస్పూన్ నూనె వేడిచేసి పచ్చిమిరపకాయలు, నువ్వులు, పచ్చిశనగపప్పు కొన్ని (ఉంచుకోవాలి), కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. చల్లారాక పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో దోసకాయ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి.

విడిగా ఒక టీస్పూన్ నూనె వేడిచేసి, ఆవాలు చిటపటలాడాక, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టి దోసకాయ ముక్కలు వేసి కలియబెట్టాలి.

వెబ్దునియా పై చదవండి