పనీర్ పసందైన పకోడీలు తయారు చేయడం ఎలా?

FILE
పనీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చిన్న పిల్లలకు ఇష్టమైన ఆహారం పెట్టాలంటే పనీర్ ఫ్రైలే కాకుండా పకోడీలు కూడా తయారు చేయండి. ఎప్పుడూ ఒకే విధంగా టిఫన్‌ కట్టకుండా వెరైటీగా వంటలు వండి స్నాక్స్ డబ్బా నింపి పంపండి. ఇక పనీర్‌తో పసందైన పకోడీలు తయారు చేయడం ఎలాగో చూద్దామా..

కావలసిన పదార్థాలు :
పనీర్ - అరకేజీ
సెనగ పిండి - రెండున్నర కప్పు
ఉప్పు - తగినంత
కారం - ఒక టీ స్పూన్
నూనె, నీరు - తగినంత.

తయారీ విధానం :
ముందుగా సెనగపిండిలో ఉప్పు, కారం వేసి కాసిని నీళ్లు పోసి చిక్కగా కలిపి పక్కన ఉంచాలి. పనీర్‌ను కావాల్సిన సైజుల్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పనీర్ ముక్కలను సెనగపిండిలో ముంచి కాగిన తర్వాత నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని బ్లాటింగ్ పేపర్ మీద వేసి నూనె అద్ది పుదీనా చట్నీ లేదా టమోటా సాస్‌తో సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి