బ్రెడ్‌తో పకోడీలు ఎలా చేయాలో మీకు తెలుసా?

FILE
పిల్లలు వేసవి సెలవుల్లో ఇంట్లో ఉంటారు. వారికి బోర్ కొట్టకుండా వుండేందుకు ఆడుకోనివ్వడంతో పాటు వెరైటీ వెరైటీగా వంటకాలు తయారు చేసి సర్వ్ చేయండి. బ్రెడ్‌ను ఎప్పుడూ జామ్ అందించడం కంటే బ్రెడ్ పకోడీలా ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు :
శనగపిండి - రెండు కప్పులు.
జొన్నపిండి - ఒక కప్పు
బఠాణీ పిండి - అర కప్పు
కొత్తిమీర - అరకప్పు
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
మజ్జిగ - ఒక కప్పు.
బ్రెడ్ - 12 ముక్కలు
ఉల్లి (తురుము) - అరకప్పు
మిర్చి, అల్లం పేస్టు - మూడు టీ స్పూన్లు.

తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా చేసుకోవాలి. బ్రెడ్ స్లైసుల చివర్లు కట్‌చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండేయాలి. బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది ఆపై ఆయిల్‌లో దోరగా వేయించాలి. వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాట సాస్‌లతో కలిపి పిల్లలకు సర్వ్ చేస్తే.. పిల్లలు ఇష్టపడి తింటారు.

వెబ్దునియా పై చదవండి