బ్రౌన్ రైస్ పలావ్ తయారు చేయడం ఎలా?

FILE
బ్రౌన్ రైస్‌లో డైటీ ఫైబర్ ఉంటుంది. తద్వారా ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు. శరీర బరువును నియంత్రించడం, క్యాన్సర్, గుండెకు సంబంధిత రోగాలను బ్రౌన్ రైస్ దూరం చేస్తుంది. అలాంటి బ్రౌన్స్ రైస్‌తో పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దామా..

కావాల్సిన పదార్థాలు :
బ్రౌన్ రైస్ : ఒకటిన్నర కప్పులు
కొత్తిమీర ఆకులు : ఒకటిన్నర కప్పులు
పుదీనా ఆకులు : అరకప్పు
వెల్లుల్లి రేకులు : ఎనిమిది
నూనె : ఒక టీ స్పూన్
పచ్చిమిరపకాయలు : రెండు
యాలకులు : మూడు
దాల్చిన చెక్క : అంగుళం
లవంగాలు : ఎనిమిది
అల్లం ముక్క : అంగుళం
క్యారెట్ : ఒకటి
చిన్న క్యాలీఫ్లవర్ ముక్కలు : ఏడెనిమిది
ఉప్పు : రుచికి సరిపడా
వెజిటబుల్ స్టాక్ : నాలుగున్నర కప్పులు
ఫ్రెంచ్ బీన్స్ : నాలుగైదు


తయారు చేసే పద్దతి : రెండున్నర కప్పుల నీటిలో బ్రౌన్‌రైస్‌ను రెండు గంటలపాటు నానబెట్టాలి. నీటిని ఓంపేసి పక్కన ఉంచుకోవాలి. గ్రీన్ చట్నీకు కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిరప కాయలు మెత్తగా రుబ్బుకోవాలి.

నాన్ స్టిక్‌పాన్‌లో నూనె వేడిచేసి దాల్చిన చెక్క, యాలకులు, అల్లం ముక్కలు, లవంగాలు వేసి వేయించాలి. క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్ ముక్కలు, బియ్యం వేసి బాగా కలియబెట్టాలి.

మూడు టేబుల్ స్పూన్లు గ్రీన్ చట్నీ, ఉప్పు వేసి కలిపి వెజిటబుల్ స్టాక్ పోసి కలియబెట్టాలి. పొంగురావడం ఆరంభించాక సిమ్‌లో ఉంచి ఉడికించాలి. వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి