మైసూర్‌ రసంతో అన్నం కాంబినేషన్ అదుర్స్!

FILE
ఫైబర్ అధికంగా ఉండే మైసూరు కందిపప్పుతో రసం అంటేనే అదిరిపోతుంది. కార్పొహైడ్రేట్స్, ప్రోటీన్లు అధికంగా గల ఈ పప్పును వంటకాల్లో అధికంగా ఉపయోగించాలని న్యూట్రీషన్లు అంటున్నారు. ఓకే ఇక మైసూర్ రసం ఎలా చేయాలో చూద్దామా..

కావలసిన పదార్థాలు :
‌‌కందిపప్పు - ఒక కప్పు.
చింతపండు - తగినంత
‌‌టొమాటో - రెండు
జీలకర్ర - అర టీస్పూన్‌
పసుపు - చిటికెడు.
ఉప్పు - తగినంత.
ఎండుమిర్చి - 4.
కొబ్బరి తురుము - అర టేబుల్‌ స్పూన్‌.
నెయ్యి - 1 టీ స్పూన్‌.

పౌడర్ కోసం..
జీలకర్ర, ఆవాలు - అర టేబుల్‌ స్పూన్‌.
కరివేపాకు - 3.
కందిపప్పు - 1 టేబుల్‌ స్పూన్‌.
మిరియాలు - 2 అర టేబుల్‌ స్పూన్‌.
మెంతులు - పావు టీ స్పూన్‌.
ధనియాలు - అర టీ స్పూన్‌.

తయారీ విధానం:
ముందుగా మైసూర్ కందిపప్పుని కుక్కర్లో వేసి మెత్తగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో 1 టీ స్పూన్‌ నూనె వేసి, పౌడర్ కోసం చెప్పిన దినుసులన్నీ వేసి 3 నిమిషాలపాటు వేయించాలి. కొబ్బరి తురుము జత చేసి మరో నిమిషం పాటు వేయించాక చల్లార్చి గ్రైండ్ చేసి, రుబ్బిన కందిపప్పు, చింతపండు రసంలో కలుపుకోవాలి.

స్టౌ మీద బాణలి పెట్టి నెయ్యి వేడయ్యాక, జీలకర్ర, ఆవాలు చిటపటలాడించి పసుపు, కరివేపాకుని వేసి వేగాక టొమాటో ముక్కల్ని వేయాలి. కాసేపయ్యాక ఇందులో చింతపండు, కందిపప్పు, పౌడర్ కలిపిన నీటిని చేర్చి తెల్లు రాకముందే కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. ఈ రసాన్ని వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే కాంబినేషన్ అదిరిపోద్ది.!

వెబ్దునియా పై చదవండి