మొక్క జొన్నతో వడలు తయారు చేయడం ఎలా?

శుక్రవారం, 28 జూన్ 2013 (16:59 IST)
FILE
కావాల్సిన పదార్థాలు :
మొక్క జొన్న గింజలు : 1 కప్పు
శెనగపప్పు : 1 కప్పు
ఉల్లి తరుగు : పావు కప్పు
పచ్చి మిర్చి తరుగు : రెండు చెంచాలు
అల్లం తరుగు : 1 చెంచా
కరివేపాకు : 1 రెమ్మ
ఉప్పు, పసుపు : చిటికెడు
నూనె : తగినంత

తయారు చేయు విధానం : శెనగపప్పుని నానబెట్టి, తర్వాత కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. దీనిలో నూనె తప్ప మిగతావన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకుని, నూనెలో వేయించాలి. చట్నీతో తింటే చాలా బాగుంటాయి.

వెబ్దునియా పై చదవండి