తయారుచేయండి ఇలా: మొదట బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వాము వేసి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి. ఆ తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరవాత ఈ ముక్కలను అందులో వేసి గోధుమ రంగువచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో ఉల్లి తరుగును కూడా వేసి బ్రౌన్‌గా వేయించాలి. అనంతరం తగినంత ఉప్పు, పసుపు, మిరప్పొడి, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తర్వాత వేయించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి మంటను బాగా తగ్గించి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే అమృత్‌సర్ ఆలు రెడీ. చివరిగా కొత్తిమీరను గార్నిష్ చేయాలి. అమృత్‌సర్ ఆలు పరాఠాలలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి.