వుమెన్స్ డే స్పెషల్ : ఈజీ చీజ్ దోసె రిసిపీ

శనివారం, 7 మార్చి 2015 (18:57 IST)
వుమెన్స్ డే రోజున ఎప్పటిలాగానే వెరైటీలేని ఇడ్లీ, దోసెలతో సరిపెట్టకుండా కాస్త వెరైటీ బ్రేక్ ఫాస్ట్‌గా చీజ్ దోసె రిసిపీ ట్రై చేయండి. ఎలా చేయాలంటే? 
 
కావలసిన పదార్థాలు :
దోసె పిండి : తగినంత 
డైరీ ప్రోసెస్డ్ చీజ్ : వంద గ్రాములు 
ఛాట్ మసాలా : తగినంత 
మిరియాల పొడి : తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా బాణలి వేడయ్యాక దోసెపిండి పోయాలి. మంటను తగ్గట్టు తగ్గించుకోవాలి. దోసె పిండి చుట్టూ ఆయిల్ పోసుకోవాలి. దోసెపై చీజ్ రాసి రెండు నిమిషాలు వెయిట్ చేయాలి. చీజ్ కరిగాక దోసెపై మిరియాల పొడి, ఛాట్ మసాలా చిలకరించి వేడి వేడిగా టమోటా కెచప్‌తో పిల్లలకు, గ్రీన్ ఆర్ టమోటా చట్నీతో పెద్దలకు సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి