శెనగలను ఉడికించిన నీటితో మిరియాల పొడి, పసుపు, ఉప్పు, టమోటా, ఇంగువను చేర్చి రసంలా పెడితే టేస్టు చాలా బాగుంటుంది. ఎందుకంటే.. శెనగలను నానబెట్టిన నీళ్లల్లో ఉడికించినప్పుడు ఆ నీళ్ళల్లో కూడా మంచి పోషక పదార్థాలు వుంటాయి.
ఆ నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఇక దానిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి అనే విషయం లోకి వస్తే.. విటమిన్ డి, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అంటే లినొలెనిక్ లేదా ఒలిక్ యాసిడ్ లాంటివి ఉంటాయి.