ముందుగా మొక్కజొన్న గింజలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, జీలకర్ర, ఉప్పులను వేసి కలిపి ఓ తిప్పు తిప్పండి. బాణాలిలో నూనె వేసి కాగాక, ఈ పిండిని పకోడీలుగా వేయండి. అటు ఇటు తిప్పుతూ బంగారు వన్నె వచ్చేంతవరకు వేయించండి. వీటిని పుదీనా చట్నీతో సర్వ్ చేయండి. మొక్కజొన్నతో చేసినవి కాబట్టి శరీరానికి కావలసిన విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.