దోసకాయతో రుచికరమైన మజ్జిగ ఎలా చేయాలంటే..?

మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (18:51 IST)
Cucumber Buttermilk
వేసవి కాలంలో దోసకాయ తినడం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ప్రతిరోజూ మనం దోసకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. దోసకాయను పెరుగుతో చేర్చి తీసుకోవాలి. ఇంకా దోసకాయతో రుచికరమైన మజ్జిగ డ్రింక్‌ను ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు: దోసకాయ - 2,
మిరియాలు - అర టీస్పూన్,
పుదీనా - కొద్దిగా 
ఉప్పు - కొద్దిగా,
ఐస్ క్యూబ్స్ - కావలసినంత
మజ్జిగ - కావలసినంత 
 
తయారీ విధానం: 
ముందుగా దోసకాయ తొక్కను తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై దోసకాయ ముక్కలు, మిరియాలు, ఉప్పు, ఐస్ క్యూబ్స్, మజ్జిగ, పుదీనా వేసి బాగా గ్రైండ్ చేయాలి. తురిమిన రసాన్ని స్ట్రైనర్‌లో పోసి గాజు గ్లాసులో వడకట్టి సర్వ్ చేయొచ్చు. అంతే దోసకాయతో మజ్జిగ డ్రింక్ రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు