ఆమ్లా రైస్ ఎలా చేయాలో తెలుసా?

శనివారం, 22 సెప్టెంబరు 2018 (14:35 IST)
కావలసిన పదార్ధాలు:
బియ్యం - అరకప్పు 
ఉసిరికాయలు - 10 
పసుపు - అర స్పూన్ 
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత 
నూనె - తగినంత 
నువ్వుల పొడి - 2 స్పూన్స్
జీడిపప్పు - 4 
ఎండుమిర్చి - 4
పచ్చిమిర్చి - 4 
కరివేపాకు - 2 రెమ్మలు 
కొత్తిమీర కట్ట - 1 
శెనగపప్పు - 1 స్పూన్ 
మినప్పప్పు - 1 స్పూన్ 
ఆవాలు - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఇప్పుడు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్‌చేసుకుని అందులో ఉప్పు వేసి వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. 3 నిమిషాల తరువాత దించుకుని అందులో అన్నం కలుపుకుంటే వేడివేడి ఆమ్లా రైస్ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు