ఆవాలు - అరస్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - తగినంత.
తయారీ విధానం:
ముందుగా బాణలిలో స్పూన్ నూనె వేసి ఇంగువ, ఎండుమిర్చి వేయించుకోవాలి. ఆ తరువాత అదే బాణలిలో ముల్లగిం తురుము, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగించాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో బాణిలిలో నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే... నోరూరించే ముల్లంగి పచ్చడి రెడీ...