తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పంచదార, ఉప్పు వేసి నీరు, నాలుగు కప్పుల పాలు పోసి సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ 30 నిమిషాల పాటు బియ్యాన్ని ఉడికించాలి. మిగిలిన మూడు కప్పుల పాలలో గుడ్డుసొన, వెనిల్లా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి స్టవ్ మంట పెంచి మరో 5 నిమిషాలు ఉడికించాలి. పుడ్డింగ్ మిశ్రమం చల్లబడిన తరువాత పెద్ద గిన్నెలో వేసి దానిపై దాల్చిన చెక్క పొడి చల్లాలి. అంతే... టేస్టీ టేస్టీ రైస్ పుడ్డింగ్ రెడీ.