కరోనావైరస్.. బయటి తిండి వద్దు, ఇది చేసి పెడితే టేస్టీగా...

బుధవారం, 19 ఆగస్టు 2020 (22:57 IST)
కరోనావైరస్ వల్ల ఇప్పుడు హోటల్సులో తినే అవకాశం లేదు. కనుక ఇంట్లోనే రుచికరంగా చేసుకుని తినవచ్చు. అదికూడా వెజిటబుల్ బిర్యానీ. బ్రౌన్ రైస్‌తో ఎలా చేయాలో చూద్దాం.
 
కావాల్సిన పదార్థాలు : 
బ్రౌన్ రైస్ : ఒకటిన్నర కప్పులు
కొత్తిమీర ఆకులు : ఒకటిన్నర కప్పులు
పుదీనా ఆకులు : అరకప్పు
వెల్లుల్లి రేకులు : ఎనిమిది
నూనె : ఒకటీ స్పూన్
పచ్చిమిరపకాయలు : రెండు
 
తయారు చేసే పద్దతి : రెండున్నర కప్పుల నీటిలో బ్రౌన్‌రైస్‌ను రెండు గంటలపాటు నానబెట్టాలి. నీటిని ఒంపేసి పక్కన ఉంచుకోవాలి. గ్రీన్ చట్నీకు కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మెత్తగా రుబ్బుకోవాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడిచేసి దాల్చిన చెక్క, యాలకులు, అల్లం ముక్కలు, లవంగాలు వేసి వేయించాలి. క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్ ముక్కలు, బియ్యం వేసి బాగా కలియబెట్టాలి.
 
మూడు టెబుల్ స్పూన్లు గ్రీన్ చట్నీ, ఉప్పు వేసి కలిపి వెజిటబుల్ స్టాక్ పోసి కలియబెట్టాలి. పొంగు రావడం ఆరంభించాక సిమ్‌లో ఉంచి ఉడికించాలి. ఆ తర్వాత దించేసి వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు