నరాలను బలోపేతం చేస్తాయి. నట్స్‌లో గుండె ఆరోగ్యకరమైన పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గింజలలో తక్కువ సోడియం, అధిక పొటాషియం స్థాయిలు ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడతాయి.
తయారీ విధానం :
ముందుగా బియ్యం పిండిని ఇడ్లీ పాత్రలో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత బెల్లంను పాకం పట్టుకోవాలి. కొబ్బరిని తురుముకోవాలి. యాలకుల పొడిని చేసుకోవాలి. వేయించిన నట్స్‌ను సిద్ధం చేసుకోవాలి. నట్స్‌ను పొడి చేసుకోవాలి. తర్వాత ఉడికించిన బియ్యం పిండిలో చిటికెడు ఉప్పును చేర్చి బాగా కలుపుకోవాలి. ఆపై బెల్లం పాకంను వడకట్టి రుచికి తగినంత చేర్చుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి అందులో కొబ్బరి తురుము, నట్స్ పౌడర్, యాలకుల పొడి చేర్చి బాగా కుడుముల పిండిలా సిద్ధం చేసుకోవాలి. వాటిని కుడుముల్లా చేసుకుని.. ఇడ్లీ పాత్రలో వుంచి తిరిగి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే కుడుములు రెడీ.