ఉప్పు- సరిపడా.
సొరకాయ తొక్కు తీసి ముక్కలుగా కోయాలి. పచ్చి వాసన పోయే వరకు ముక్కల్ని ఉడికించి దించి నీళ్లు వంపేయాలి. తరువాత బియ్యం, నువ్వులు విడివిడిగా ఒక గంట చొప్పున నానబెట్టాలి. తరువాత ఈ రెండింటిని రెండు టీస్పూన్ల ఆవాలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు చేర్చి రుబ్బాలి.
బాణాలిలో నూనె వేసి కొద్దిగా ఆవాలు వేసిన తరువాత సొరకాయ ముక్కలు వేసి పది నిమిషములు వేయించాలి. తరువాత బియ్యం, నువ్వులు అన్ని కలిపి రుబ్బిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఒక స్పూను కారం వేసి మూత పెట్టి పది నిమిషములు సన్నని సెగపై ఉంచి చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లాలి. అంతే... ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ ఆవకూర రెడీ.