క్యాప్సికమ్‌తో గ్రేవీ ఎలా చేస్తారు?

FILE
క్యాప్సికమ్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. రక్తపోటు తగ్గించడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను క్యాప్సికమ్ చేరనివ్వదు. గుండెపోటు, అనారోగ్య సమస్యలు, జలుబు, జ్వరం వంటి వ్యాధులకు చెక్ పెట్టే క్యాప్సికమ్.. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అలాంటి క్యాప్సికమ్‌తో గ్రేవీ ఎలా తయారు చేస్తారో చూద్దామా..

కావలసిన వస్తువులు:
కాప్సికమ్ - అర కేజి.
పుట్నాల పప్పు - 100 గ్రా.
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత.
ఎండుమిర్చి - నాలుగు.
ఎండు కొబ్బరి - 25 గ్రా.
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు.

తయారీ విధానం :
ముందుగా పుట్నాలు శుభ్రం చేసుకుని ఎండుమిర్చి కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి మిక్సీలో పొడిచేసి ఉంచుకోవాలి. తర్వాత కాప్సికమ్‌ను శుభ్రం చేసుకుని తొడిమల దగ్గర చాకుతో గుండ్రంగా కోసి తొడిమను తీసేసి గింజలన్నిటినీ విదిలించేయాలి.

స్టౌ మీద బాణలి ఉంచి కాప్సికమ్‌ ముక్కల్ని పేర్చి ఒక గరిటెడు నూనె పైన వేసి అన్నిటినీ అటూ ఇటూ తిప్పుతూ గోధుమరంగు వచ్చే వరకు వేగించి తియ్యాలి. అంతకుముందు కొట్టిపెట్టుకున్న పొడిలో ఒకస్పూను నూనె వేసి కాస్త తడిపొడిగా కలుపుకోవాలి.

ఒక్కొక్క కాప్సికమ్‌లో మూడు లేక నాలుగు స్పూన్ల పొడిని కూరాలి. కాప్సికమ్ విరిగిపోకుండా చూసుకోవాలి. పొడి కూరిన తర్వాత కాప్సికమ్‌లను బాణలిలో పేర్చి రెండు గరిటెల నూనెను అన్ని కాప్సికమ్‌ను అటూ ఇటూ తిప్పుతూ సన్నని సెగ మీద మగ్గించాలి. ఇవి కచోరీల్లా ఇవి అన్నంలోకి, చపాతీల్లోకి కూడా బాగుంటాయి. అదే కాసింత నీరు కలిపి మగ్గించి కూరలా దించేస్తే క్యాప్సికమ్ కూర రెడీ..!

వెబ్దునియా పై చదవండి