క్యాప్సికమ్‌తో బజ్జీలు ఎలా చేయాలో తెలుసా?

FILE
క్యాప్సికమ్ లోబీపీని నియంత్రిస్తుంది. అంతేకాదు.. కొలెస్ట్రాల్‌ను తగ్గించే క్యాప్సికమ్ గుండెపోటు, హృద్రోగ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. పెయిన్ కంట్రోల్, క్యాన్సర్‌కు చెక్ పెట్టే క్యాప్సికమ్‌ను వారానికి రెండు సార్లు తీసుకుంటే జలుబు, జ్వరం వంటివి దరి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి క్యాప్సికమ్‌ను పిల్లలు ఇష్టపడి తినాలంటే బజ్జీలు ట్రై చేయండి. సో క్యాప్సికమ్‌తో బజ్జీలు ఎలా చేయాలంటే?

కావలసిన పదార్థాలు:
కాప్సికమ్ - అర కేజి.
నూనె - పావు కేజి.
జీలకర్ర - ఒక స్పూను.
వంటసోడా - చిటికెడు.
శనగపిండి - పావు కేజి.
మిరప్పొడి - ఒక స్పూను.
ఉప్పు - తగినంత.

తయారీ విధానం :

ముందుగా క్యాప్సికమ్‌లను బాగా కడిగి ఒక్కొక్క దాన్ని నాలుగైదు ముక్కలుగా నిలువుగా తరుక్కోవాలి. గింజలు, తొడిమ తీసేయాలి. శనగపిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, వంటసోడా అన్నీ వేసి బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి ఒక్కొక్క కాప్సికమ్ ముక్కను శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వెయ్యాలి. వేగాక తీసి చిల్లీసాస్‌తో వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి