ఛీజ్, చిల్లి దోసె ఎలా చేయాలో చూద్దాం!

FILE
చిల్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్‌ చెక్ పెట్టే చిల్లీతో పాటు డెంటల్ కేర్, ఎముకలకు బలాన్నిచ్చే ఛీజ్‌తో కలిసి దోసె తయారు చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్థాలు :
రెండు టేబుల్ స్పూన్ల ఛీజ్ తురుము,
ఒక టేబుల్ స్పూన్ పచ్చి మిరపకాయ ముక్కలు,
ఒక టీ స్పూన్ కొత్తిమీర.

తయారీ విధానం :
ఛీజ్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కలిపి ఫిల్లింగ్ మిశ్రమం తయారు చేసుకోవాలి. దోసెపిండిలో పచ్చిబియ్యానికి బదులు ఒక కప్పు రవ్వ కలపి.. రవ్వదోసె పిండి తయారు చేసుకోవాలి. పైనంపై దోసెవేశాక ఓ వైపు కాలనిచ్చి, రెండో వైపునకు తిప్పి నడుమ ఛీజ్ మిశ్రమం వుంచి దోసెను చుట్టాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా వుంటాయి.

వెబ్దునియా పై చదవండి