నిమ్మతో షర్బత్‌ ఎలా తయారు చేస్తారు?

FILE
నిమ్మ రసంతో చేకూరే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. అమ్మవలె మనల్ని కాపాడే నిమ్మ చర్మం నిగారింపుకు, బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పొట్టలో నొప్పి, గ్యాస్, ఊబకాయం, గొంతు సమస్యలు, అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది. అలాంటి నిమ్మతో షర్బత్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామా..

కావలసిన వస్తువులు...
నిమ్మకాయలు - 4,
ఉప్పు - సరిపడ.
చక్కెర - 4 కప్పులు.
నీరు - 3/4 కప్పు.
మీకిష్టమైన రంగు - 1 స్పూన్.
ఎస్సెన్స్ (మీకిష్టమైంది) - 1 స్పూన్

తయారు చేసే విధానం...
ముందుగా 2 కప్పుల పంచదారకు ముప్పావు కప్పు నీరు పోసి తీగ పాకం వచ్చేంత వరకు వేడి చేయాలి. అందువలో టీ స్పూన్‌ నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో నీళ్ళు కలిపి, లేతపాకంలో పోసి 2, 3 సార్లు కలియబెట్టి దించాలి. నిమ్మ ఉప్పు వేయగానే పాకం నిమ్మ తొనల సువాసన వస్తుంది.

ఆ పాకంలో మిఠాయి రంగు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. తర్వాత ఎస్సెన్స్‌ 2, 3 చుక్కలు వేసి కలిపి గట్టిగా మూత పెట్టాలి. కాస్త చల్లారిన తర్వాత పొడిగా ఉన్న సీసాల్లో భద్ర పరుచుకోవాలి. ఇంటికి అతిథులు వచ్చినపుడు ఇచ్చేటప్పుడు రెండు స్పూన్లు పాకాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి సర్వ్‌ చేస్తే సూపర్‌గా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి