పనీర్‌ కోకోనట్‌‌ టేస్ట్ చేశారా..?

FILE
కోకోనట్, పనీర్‌లో అత్యధిక కెలోరీలున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. పనీర్ బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తే.. కోకోనట్ శరీరానికి కావాలిసిన విటమిన్స్, మినరల్స్ అందిస్తుందని చెబుతున్నారు. ఈ రెండింటితో పనీర్ కోకోనట్ ఎలా తయారు చేయాలో చూద్దామా..

కావలసిన పదార్థాలు:
పనీర్‌ - 100గ్రా
కొబ్బరి పొడి - రెండు టీ స్పూన్లు.
క్రీమ్‌ - ‌రెండు టేబుల్‌ స్పూన్లు.
జీలకర్ర - చిటికెడు
నూనె - ఒక టీ స్పూను
పుదీనా పేస్ట్‌ - రెండు టీ స్పూన్లు.
ఫుడ్‌ కలర్‌(గ్రీన్‌) - చిటికెడు.
ఉల్లిపాయ ముక్కలు (సన్నగా తరగాలి) - రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం :
ముందుగా పనీర్‌ను వెడల్పుగా టిక్కాల కోసం కట్‌ చేసుకున్నట్లుగా కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను, జీలకర్రను వేసి వేయించాలి. ఇవి రెండూ వేగిన తరువాత కొబ్బరి పొడి, క్రీమ్‌ వేసి సన్న మంట మీద వేయించాలి.

ఇవన్నీ గ్రేవీ అయిన తరువాత అందులో పనీర్‌ ముక్కలను వేయాలి. చివరిగా పుదీనా పేస్ట్‌ వేసి కలిపితే పనీర్‌ కోకోనట్‌ రెడీ. దీనిని రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి