ఫ్రూట్ సమోసా ఎలా చేయాలో మీకు తెలుసా?

FILE
ప్రతి పండులో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలున్నాయి. అలాంటి పండ్లను జ్యూస్‌ల రూపంలో గాకుండా, అలాగే తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ఆరోగ్య నిపుణులు. శరీరానికి శక్తినిచ్చే పండ్లతో జ్యూస్‌లు, ఫ్రూట్ సలాడ్ల రూపంలో సమోసా చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా.

కావలసిన పదార్థాలు :
మైదాపిండి - రెండు కప్పులు
నెయ్యి (పూర్ణానికి) - రెండు టేబుల్ స్పూన్లు
అరటిపండు, ఖర్జూరాలు - అర కప్పు.
జాజికాయ పొడి - అర టీ స్పూన్‌.
నారింజ లేదా నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:
ముందుగా పూర్ణానికి అరటి పండు, ఖర్జూరాలు నెయ్యి వేసి కలిపి పెట్టుకోవాలి. మైదాపిండికి నెయ్యి, నీరు చేర్చి చపాతీలు చేసుకోవాలి. వీటి మద్యలో పూర్ణం పెట్టి మూసేయాలి. పెనం వేడిచేసి, సమోసాలను వేసి, నేతితో రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. యమరుచిగా వుండే ఈ సమోసాలను మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తాయి.

వెబ్దునియా పై చదవండి