బంగాళదుంప వేపుడు ఎలా చేయాలి?

FILE
బంగాళాదుంపలను తినడం వలన విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. అంతే కాకుండా పోటాషియం, కాపర్, ఐరన్‌లు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషక విలువలు ఉన్న బంగాళాదుంపను తీసుకోవడం వలన గుండెకు మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు. అటువంటి బంగాళాదుంపతో వేపుడు చేసుకుంటే రుచికి, రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. ఈ బంగాళా దుంప వేపుడు ఎలా చేయాలంటే..

కావలసిన పదార్థాలు :
బంగాళదుంపలు - 4.
కారం - తగినంత.
ఉప్పు - తగినంత.
నూనె - వేయించడానికి సరిపడినంత.


తయారీ విధానం :
ముందుగా బంగాళదుంపలు పొట్టు తీసి సన్నగా తరగాలి. తరువాత నీటిలో కడగాలి. కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక బంగాళదుంపల ముక్కలు వేసి తక్కువ మంట మీద వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, ఉప్పు వేసి కలిపి దించాలి. కారం కాక పోయినా అందులో పప్పుల పొడుము కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు.

వెబ్దునియా పై చదవండి