కావాల్సిన పదార్థాలు : మొక్క జొన్న గింజలు : 1 కప్పు శెనగపప్పు : 1 కప్పు ఉల్లి తరుగు : పావు కప్పు పచ్చి మిర్చి తరుగు : రెండు చెంచాలు అల్లం తరుగు : 1 చెంచా కరివేపాకు : 1 రెమ్మ ఉప్పు, పసుపు : చిటికెడు నూనె : తగినంత
తయారు చేయు విధానం : శెనగపప్పుని నానబెట్టి, తర్వాత కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. దీనిలో నూనె తప్ప మిగతావన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకుని, నూనెలో వేయించాలి. చట్నీతో తింటే చాలా బాగుంటాయి.