వంకాయ బఠాణీ కూర ఎలా చేయాలి?

FILE
వంకాయ - బఠాణీ కూర ఎలా చేయాలో మీకు తెలుసా. వంకాయతో చాలా రకాల కూరలు తయారు చేయవచ్చు. అలాంటి వంకాయలతో బఠానీలను కలిపి చేస్తే ఆ టేస్ట్ అదిరిపోద్ది. అయితే ఈ కూరకు వంకాయలను సన్నగా వాడితే టేస్ట్ బాగుంటుంది. ఓకే బఠానీల కూర ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:
‌‌వంకాయలు - అరకిలో.
పచ్చిబఠాణీ - 1 కప్పు.
‌‌‌వెల్లుల్లి రేకులు - 6.
‌‌ఎండుమిర్చి - ‌3.
పసుపు - ‌పావు టీ స్పూన్‌.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు - 2.
పచ్చిమిర్చి - 3 (మెదుపుకోవాలి).
నూనె - 1 టేబుల్‌ స్పూన్‌.
‌‌కొత్తిమీర - ‌గార్నిష్‌కి సరిపడా.
ఆవాలు, జీలకర్ర - 1 టీ స్పూన్‌.
అల్లం తరుగు - అర టీ స్పూన్‌.
కరివేపాకు రెబ్బలు - 3.

తయారీ విధానం :
ముందుగా ఒక కప్పు నీటిలో ఉప్పు వేసి, పసుపు, వంకాయలు, బఠాణీ వేసి ఉడికించాక నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాత్రలో నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి అరనిమిషం పాటు వేయించుకోవాలి.

తర్వాత ఉడికించుకున్న వంకాయలు, బఠాణీ, ఉప్పు వేసి కలియ బెట్టి అయిదు నిమిషాలపాటు వేయించుకున్నాక మూతపెట్టి 15 నిమిషాల తరువాత దించేయాలి. కొత్తిమీరతో గార్నీష్ చేసి వేడిగా రోటీల్లోకి గాని అన్నంలోకి గాని వడ్డిస్తే యమా టేస్ట్‌గా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి