వేడి, వేడి కరాచీ దోసె తయారు చేయడం ఎలా?

బుధవారం, 26 డిశెంబరు 2012 (18:41 IST)
FILE
సాయంత్రం మీ పిల్లలు స్నాక్స్ తినే సమయానికి ఏవేవో నూనె పదార్థాలు షాపులో కొనివ్వడం కంటే టిఫిన్‌ ఇంట్లో తయారు చేయడం పిల్లల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే టిఫిన్లు కూడా టేస్టీగా, పోషకాలు ఉండేలా చూసుకోవాలి.

అందుచేత పిల్లలు ఇష్టపడే పదార్థాలనే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది, ఇలా పిల్లలు ఇష్టపడే వేడి వేడి కరాచీ దోసె తయారు చేయడం ఎలాగో మీకు తెలుసా..? ఇదోగోండి కరాచీ దోసె ట్రై చేయండి

కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ : కప్పు
మైదా పిండి : కప్పు
బియ్యపు పిండి : కప్పు
నూనె : టెబుల్ స్పూను
ఆవాలు : తాలింపుకు తగినంత
జీలకర్ర : ఒక టీస్పూన్
ఉల్లిపాయ : అర కప్పు
అల్లం, మిర్చి, కొత్తి మీర పేస్ట్ : రెండు టీ స్పూన్లు
పుల్లటి పెరుగు: రెండు స్పూన్లు.
కరివేపాకు : రెండు రెబ్బలు
ఉప్పు: సరిపడా.

తయారీ విధానం :
ముందుగా రవ్వ, మైదా, బియ్యప్పిండి అన్నీ కలపాలి. తగినన్ని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా మృదువుగా కలుపుకోవాలి. తరువాత ఉప్పు, పెరుగు కూడా వేసి కలపాలి. విడిగా బాణిలోని నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక వీటిని పిండిలో కలపాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా జారుగా కలిపిన పిండిలో చేర్చి.. దోసె పెనం వేడయ్యాక దోసెలు పోసి దోరగా వేయించి హాట్ హాట్‌గా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి.

వెబ్దునియా పై చదవండి