పిల్లలకు స్నాక్స్ అంటే తెగ ఇష్టం. అలాంటప్పుడు అంగట్లో ఏవి పడితే అవి కొనిపెట్టకుండా ఇంట్లోనే హైజినిక్ ఫుడ్ తయారు చేసి పెట్టండి. ఇలాంటి స్నాక్స్‌లో ఒకటైన సగ్గుబియ్యంతో స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దామా..
కావలసిన పదార్థాలు : చిలకడ దుంప - ఒకటి సగ్గుబియ్యం - అర కప్పు జీలకర్ర - ఒక టీ స్పూను శెనగపప్పు - ఒక టెబుల్ స్పూను కరివేపాకు - ఒక రెబ్బ పచ్చిమిరపకాయలు - రెండు కొత్తిమీర తురుము - ఒక టేబుల్ స్పూను ఉప్పు - తగినంత నూనె - సరిపడా
తయారు చేయు విధానం : సగ్గు బియ్యాన్ని ఓ అరగంట నీళ్లలో నానబెట్టాలి. చిలకడ దుంపలపై పొట్టు తీసి చిన్న ముక్కులుగా కోసుకోవాలి. పోయ్యి మీద మందపాటి గిన్నెపెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, శెనగపప్పు వేసి వేగించాలి.
తర్వాత చిలకడ దుంప ముక్కలు వేసి ఎర్రగా అయ్యేవరకూ వేగించాలి. చివర్లోనానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేగించాలి. దించేముందు తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి దించేయాలి. వీటిని సాయంత్రం స్నాక్స్‌లా తింటే బాగుంటాయి.