వినాయక చతుర్థి స్పెషల్- బనానా హల్వా ఎలా చేయాలంటే?

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (12:11 IST)
వినాయక చవితి సందర్భంగా మోదకాలు, ఉండ్రాళ్లు చేస్తుంటాం. వీటితో పాటు అరటి పండ్లతో హల్వా కూడా తయారు చేసి.. స్వామికి నైవేద్యంగా సమర్పిద్దాం.. సింపుల్ అండ్ టేస్టీగా వుండే బనానా హల్వా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
అరటి పండు ముక్కలు - రెండు కప్పులు 
పచ్చి కోవా- ఒకటిన్నర కప్పు 
నెయ్యి- పావు కప్పు
పాలు - అర కప్పు
పంచదార - అర కప్పు, 
జీడిపప్పు, బాదం పప్పు పలుకులు- అర కప్పు
 
తయారీ విధానం:
నాన్‌స్టిక్ పాన్‌లో కోవా, అరటి పండు ముక్కలు వేసి స్టౌ మీద వుంచాలి. మీడియం హీట్‌పై వుంచి కలుపుతూ వుండాలి. కోవా కరిగి నూనెలా తేలాక.. పంచదార, జీడిపప్పు, బాదం పలుకులు వేసి కలపాలి. ఈ మిశ్రమం ముదురు గోధుమ రంగు వచ్చేవరకూ కలుపుతూ ఉడికించాలి. తర్వాత పాలు పోసి మిశ్రమం అంచులకు అంటుకోనంతవరకూ కలుపుతూ దించేయాలి. అంతే బనానా హల్వా రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు