మహిళలు రోజూ పాలకూర తీసుకుంటే?

శనివారం, 17 మే 2014 (15:21 IST)
మహిళలు పాలకూర తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. పాలకూర రక్తహీనతకు చెక్ పెడుతుంది. స్త్రీలు తమ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రతి‌రోజు తప్పనిసరిగా పాలకూర రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

పాలకూరలో ముఖ్యంగా క్యాల్షియం, సోడియమ్, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజలవణాలు, ప్రొటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

శరీరానికి కావాల్సిన ఇనుము ఇందులో పుష్కలంగా ఉంది. రోగనిరోధక‌శక్తిని పెంపొందించే తత్వం ఉంది. ఇంకా పాలకూర తీసుకుంటే జ్వరం, పిత్త, వాయు, శ్వాస సంబంధిత రోగాలు దూరమవుతాయి.

వెబ్దునియా పై చదవండి