రేప్‌కు బ్రేక్: లోదుస్తులతో కొత్త పరికరం.. తల్లిదండ్రులకు ఎస్సెమ్మెస్‌లు!

FILE
ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, చెన్నై విద్యార్థులు రేప్‌కు బ్రేక్ వేసే దిశగా కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. అత్యాచారాలకు పాల్పడే వారినుంచి మహిళలను కాపాడేందుకు ఉపకరించే ప్రత్యేకమైన లోదుస్తులను చెన్నైలోని ముగ్గురు ఆటోమొబైల్‌ ఇంజినీర్లు రూపొందించారు. వీటిని జీపీఎస్‌ మాడ్యూల్స్‌తో రూపొందించారు.

జీపీఎస్‌, జీఎస్‌ఎం సాంకేతికతలను వీటికి అనుసంధానించారు. దానివలన.. అమ్మాయిలపై ఎవరైనా లైంగిక దాడికి యత్నిస్తే.. వారి తల్లిదండ్రులకు, పోలీసులకు ఆటోమేటిగ్గా ఎస్సెమ్మెస్‌లు వెళతాయి.

అలాగే దాడికి ప్రయత్నించిన వారికి షాక్‌ కొట్టేలా కూడా ఏర్పాటు చేశారు. ఆ రీతిగా ప్రెజర్‌ సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌లోనే వీటిని మార్కెట్‌లోకి విడుదల చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి